- Advertisement -
కర్నూలు జిల్లాలో ఆనంద్ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు విడుదల అయ్యే అక్కినేని అఖిల్ సినిమా టిక్కెట్ల కోసం అఖిల్ అభిమానులు థియేటర్లు దగ్గర గుమి గుడారు.
అఖిల్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని వారు ఆనంద్ థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
