తిరుమలలో దొంగలు..కాలినడకన వెళ్తే పరుగులే..!

- Advertisement -

అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరిన తమను దారిలో.. దొంగలు వెంబడించినట్లు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన సునీల్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు పయనయ్యారు. 2, 830వ మెట్టు వద్దకు వచ్చేసరికి నలుగురు దొంగలు తమను వెంబడించినట్టు చెప్పారు.

తమను దోచుకోవటానికి ప్రయత్నించినట్లు తెలిపారు. వాళ్ల నుంచి తప్పించుకోవటానికి పరుగులు పెట్టామనీ.. డయల్ 100కి ఫిర్యాదు చేయగా.. పోలీసులు వెంటనే స్పందించి, తమను రక్షించారని భక్తులు తెలిపారు. నడక మార్గంలో అక్కడక్కడ లైట్లు వెలగటం లేదని.. భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News