Friday, April 19, 2024
- Advertisement -

పూరీ.. రాత్రి బాగా ఎడిట్ చేస్తాడట

- Advertisement -

లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది.. ఉత్తరాఖండ్ బ్యూటీ దిశా పాట్నీ. మెగా బ్రదర్ వారసుడు వరుణ్ తేజ్ హీరో కావడం.. పూరీ జగన్నాథ్ లాంటి ఏస్ డైరెక్టర్ తెరకెక్కిస్తుండడంతో.. లోఫర్ రిలీజ్ కు ముందే.. దిశా పాట్నీ పేరు టాలీవుడ్ ల అన్ని దిశలూ పాకింది. ఇదంతా పూరీ చలవే అని దిశా సంబరంగా చెబుతోంది.

వాస్తవానికి రెండేళ్ల క్రితమే పూరీ జగన్నాథ్ సినిమా కోసం ఆడిషన్ కు వెళ్లింది దిశా పాట్నీ. అప్పుడు అవకాశం రాకపోవడంతో చాలా నిరాశ చెందిన ఈ అమ్మాయికి.. లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో మంచి దిశ చూపించాడట పూరీ.

అందుకే.. పూరీ అంటే తనకో గాడ్ ఫాదర్ అన్నంత రేంజ్ లో దిశా పొగిడేస్తోంది. పగలంతా షూటింగ్ లో బిజీగా ఉంటూ రాత్రి సమయాల్లో సీన్స్ ను పూరీ బాగా ఎడిట్ చేయించేవారని లోఫర్ హీరోయిన్ చెబుతోంది. అక్కడితో ఆగకుండా..

వేరే సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేసుకునేవారని.. అంత పని చేసినా ఎక్కడా స్ట్రెస్ అన్నది పూరీ దరిదాపుల్లో కనిపించేది కాదని దిశ అంటోంది. అందుకే పూరీ అంటే తనకు ఇన్ స్పిరేషన్ అని కూడా సెలవిచ్చింది. ఏమంటారు.. నమ్మేద్దామా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -