Wednesday, May 15, 2024
- Advertisement -

రేష్మిని ‘అలా’ చూడగలమా!

- Advertisement -

బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ కు ఎదిగేవాళ్లు చాలా కొద్ది మంది. అలాంటి వాళ్లలో జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ రేష్మి ఒకరు. తన కొంటె చూపులతో.. జబర్దస్త్ యాంకరింగ్ తో ఇప్పటికే చాలా మంది అభిమానులను తన సొంతం చేసుకుంది రేష్మి. చిట్టిపొట్టి డ్రెస్సులతో టీవీ షో తోనే విపరీతంగా పాపులారిటీ సంపాదించిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది.

కెరీర్ ప్రారంభంలోనే మాంచి హారర్ స్టోరీతో బిగ్ స్క్రీన్ పై తళుక్కుమనేందుకు రేష్మీ రెడీ అయ్యింది. ఈ విషయం తెలుసుకుని రేష్మీ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారట. స్మాల్ స్క్రీన్ పై అమ్మడి అందాలకు అలవాటు పడిన వాళ్లంతా… బిగ్ స్క్రీన్ పై రేష్మీని చూడాలనుకున్నారట. అయితే.. హారర్ సినిమా అని తెలియడంతో.. ఆ అవకాశం ఉండకపోవచ్చని ఉసూరుమంటున్నారట.

కానీ.. ఫ్యాన్స్ ఎవరూ డిజప్పాయింట్ కావాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. రేష్మీ ప్రెస్టేజియస్ గా ఈ సినిమాను తీసుకోవడంతో.. అందరూ కోరుకునే అన్ని అంశాలూ ఈ హారర్ ఎంటర్ టైన్ మెంట్ లో ఉంటాయట.

జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్యాన్స్ ను అలరించేందుకు రేష్మి ఆల్రెడీ మేకప్ కూడా వేసుకుందట. చూడాలి.. ఫ్యాన్స్ ‘ఆశలు’ ఎంత వరకు నెరవేరతాయో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -