Friday, May 3, 2024
- Advertisement -

రామ్ కోసం కొడుకు సినిమా పక్కన పెట్టిన దర్శకుడు

- Advertisement -

ప్రస్తుతం రామ్ పోతినేని ప్రధాన పాత్ర లో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఇప్పటి వరకు సినిమా కి మీడియా లో మంచి బజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు పూరి. ఈ సినిమా ని చార్మ్ తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. అయితే పూరి జగన్ కొడుకు ఆకాష్ హీరో గా రొమాంటిక్ అనే సినిమా ని కూడా ప్రకటించారు పూరి. దాని తో పాటె ఇస్మార్ట్ శంకర్ ని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ముందుగా పూర్తి అయింది.

విచిత్రం ఏంటి అంటే ఈ సినిమా ని ముందు గా తీసుకొని రావడం కోసం, రొమాంటిక్ సినిమా ని కాస్త పక్కన పెట్టారట. అయితే మీడియా లో ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వస్తున్నాయి కానీ ఈ సినిమా కి పని చేసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా కొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటం వలన ఈ సినిమా ని ఇస్మార్ట్ శంకర్ విడుదల అయ్యాక పూర్తి చేయాలనే పక్కన పెట్టారట. ఆ సినిమా కి కూడా పూరి, ఛార్మి లు నిర్మాతలు కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -