Saturday, May 18, 2024
- Advertisement -

వసూల్ ఫట్.. బాలయ్యతో పూరి మరో సినిమా హిట్..

- Advertisement -

పైసా వసూల్ సినిమా రిజల్ట్ చూసాక బాలయ్య నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ మూవీ ఓ మాదిరిగా ఆడుతుందంటే అందుకు కారం బాలయ్య. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి మంచి విజయం సొంతం చేసుకున్న తర్వాత కూడా బాలయ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరితో సినిమా చేశాడు.

అయితే పైసా వసూల్ ఆశించిన సక్సెస్ కాలేదు. దాంతో బాలయ్య తప్పటడుగు వేశాడనుకుంటుంటే.. ఈ సినిమా ఫలితం చూశాక కూడా బాలయ్య పూరితో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘పైసా వసూల్’ విడుదలకు ముందు బాలయ్య-పూరి కాంబినేషన్లో ఇంకో సినిమా ఉంటుందని.. అదో పొలిటికల్ డ్రామా అని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అది ఊహాగానమే అనుకుంటే.. స్వయంగా పూరినే బాలయ్యతో తాను మరో సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు కన్ఫమ్ చేశాడు. ‘పైసా వసూల్’ చేస్తున్నపుడే తన 103వ సినిమాకు తానే దర్శకుడినని బాలయ్య స్పష్టం చేసినట్లు పూరి వెల్లడించాడు. పైసా వసూల్ ఫలితం వచ్చే వరకు ఆగుదామని తాను అన్నప్పటికీ.. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్న 103వ సినిమాను తన దర్శకత్వంలోనే చేస్తానని బాలయ్య చెప్పినట్లు పూరి వెల్లడించాడు.

ఈ మూవీ స్టార్ట్ అయ్యేలోపు.. తన కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకోనున్నట్లు పూరి చెప్పాడు. కొడుకు కోసం మూడు కథలు రెడీగా ఉన్నాయని.. అందులో ఒకటి రొమాంటిక్ లవ స్టోరీ అని.. వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని ఈ ఆక్టబర్లోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు పూరి తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -