పవన్ కళ్యాణ్ కు ప్రాణ స్నేహితులు ఎవరంటే..?

పవన్ కి చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. తన ఆలోచనలకు, మనసుకు నచ్చిన వారితో గంటల తరబడి మాట్లాడుతారు. పవన్ ఒక్కసారి స్నేహితుడిగా స్వీకరిస్తే.. ప్రాణం పోయే వరకు స్నేహాన్ని వదలరు. అటువంటు స్నేహితులు పవన్ కి ఎవరు ఉన్నారంటే..

* అలీ గురించి పవన్ చాలా సార్లు చెప్పాడు. ఆలీ తన పక్కన ఉంటే సంతోషంగా ఉంటానని.. అలీ లేకుండా సినిమాలు చేయలేనని చాలాసార్లు చెప్పాడు.

* త్రివిక్రమ్, పవన్ ని కలిపిన విషయం పుస్తకాలు. ఇద్దరికీ పుస్తకాలంటే పిచ్చి. ఇద్దరూ ఎప్పుడు కలిసినా సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు.

* సినీ రంగానికి చెందని ప్రాణ మిత్రుడు రాజు రవి తేజ. సమాజంలో మార్పు రావాలనే ఆలోచన రవిని పవన్ ని మిత్రులుగా చేశాయి. మీడియాకి దూరంగా ఉండే ఇతను జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కనిపించారు.

* పీవీపీ (ప్రసాద్ వి పొట్లూరి).. ఈయన నిర్మాత మాత్రమే కాదు.. పవన్ కి మంచి ఫ్రెండ్.

* కళా దర్శకుడు ఆనంద్ సాయి.. “పవన్ లేకుంటే నేను లేను” అని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. పవన్, సాయి మధ్య అంత మంచి అనుబంధం ఉంది.

* వెంకటేష్ తో పవన్ కి చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉంది. వెంకీ ఇంటికి తరచూ వెళ్తుండేవాడినని పవన్ వివరించారు.

* శరత్ మరార్ కి పవన్ కి మధ్య మంచి స్నేహం ఉంది. పవన్ ఆర్ధిక లావాదేవీలను శరత్ దగ్గరుండి చూసుకుంటుంటారు. “ఆయన (పవన్) నాకు కృష్ణుడు లాంటి వారు” అని శరత్ ఎంతో అభిమానంతో చెప్పారు.

* రేణు దేశాయ్, పవన్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెళ్ళికి ముందు, విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారు.

* నర్రా శ్రీనివాస్.. పవన్ నటించిన అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాల్లో కామెడితో అదరగొట్టాడు. ఈయన కూడా పవన్ ప్రాణ స్నేహితుల్లో ఒకరు.