నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబులో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దాంతో 2019 ఎన్నికల్లో గెలవటానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ నంద్యాల, కాకినాడ ఫార్ములానే అమలు చేయాలని 40 ఇయర్స్ ఇండస్ట్రీలో గట్టి ఆలోచన వచ్చింది చంద్రబాబుకు.
అధికార తెలుగుదేశం పార్టీ ‘ఎల్లో బుక్’ తీసుకురానుంది. అదీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల కోసం. 2019 ఎన్నికల్లో ఎలా గెలవాలి.? అన్న అంశానికి సంబంధించి అందులో ‘టిప్స్’ వుంటాయట. నంద్యాల ఫార్ములాతో మిగిలిన నియోజకవర్గాల్లో అదీ సార్వత్రిక ఎన్నికల్లో గెలవటం సాద్యమేనా అన్న విషయంపై మిగిలిన నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.అవేవి ఆలోచించకుండా మంగళవారం జరుగనున్న వర్క్ షాపులో ఎల్లో బుక్ ను పంపిణీ చయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
బాబు తీసుకొస్తున్న పచ్చ పుస్తకంలో ప్రధానంగా న్నికల్లో గెలవడానికి చిట్కాలు – టిప్స్ సరిపోతాయా.? సరిపోతాయని ఎవరన్నా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు. ఓటరు నాడి ఎప్పుడెలా వుంటుందో ఊహించడం కష్టం. అదే గనుక రాజకీయ పార్టీలకి అర్థమైతే, దేశంలో భవిష్యత్తులో ఎన్నికలే అవసరం లేకుండా, ఒకే రాజకీయ పార్టీ నిత్యం అధికారంలో వుండేది.
చంద్రబాబు ప్రయత్నాలు చూడటానికి బాగానే ఉన్నా అసలు ఆచరణ సాధ్యమేనా అన్నదే అందరిలోనూ డౌట్. ఎందుకంటే, ఒక నియోజకవర్గంలోని గెలుపు సూత్రం మరో నియోజకవర్గంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మొన్నటి గెలుపు సూత్రం నంద్యాలలోనే 2019 ఎన్నికలో పనికిరాకపోవచ్చు.
ఇక నంద్యాల, కాకినాడలో గెలుపు ఎలా సాధ్యమైందో చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. తెరవెనుక చంద్రబాబు నడిపిన మంత్రాంగం వల్లే టిడిపి గెలుపు సాధ్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే మంత్రాంగం వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లోనూ సాధ్యమవుతుందా అంటె అది కచ్చితంగాసాధ్యం కాదని చెప్పొచ్చు.
పార్టీ అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. ముఖ్య మంత్రిగా ఏకధాటిగా తొమ్మిదేళ్ళు, ప్రతిపక్ష నేతగా ఏకధాటిగా పదేళ్ళు పనిచేసి, తాజాగా మూడేళ్ళ ముఖ్యమంత్రి పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న ‘మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్’ చంద్రబాబు ఇంత సిల్లీగా ఎలా ఆలోచించారో ఆయనకె తెలియాలి.
