Thursday, May 16, 2024
- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త ట్రెండ్‌

- Advertisement -

వాయిస్ ఓవ‌ర్ ఒక‌ప్పుడు వీరికోసం ప్ర‌త్యేకంగా కొంద‌రు ఉండేవాళ్లు. మంచి గొంతు.. ప‌దాన్ని స్ప‌ష్టంగా ప‌ల‌క‌డం.. భావానికి అనుగుణంగా ప‌దం ప‌ల‌క‌డం వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి కావాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. ఒక‌ప్పుడు ఇది ఓ కోర్సుగా ఉండేది. దీనిపై చాలామంది ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అయితే ఇపుడు దీని పాత్ర‌లో కొత్త మార్పు వ‌చ్చింది. వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి గ‌వ‌న్నీ ఏమ‌వ‌స‌రం లేదు. మైక్ పెట్ట‌గానే మాట్లాడ‌డ‌మే.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో వాయిస్ ఓవ‌ర్‌లో కొత్త ట్రెండ్ వ‌చ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవ‌ర్ న‌టీన‌టుల మాట‌ల‌తో వెళ్తోంది. వాయిస్ ఓవ‌ర్‌లు ఇచ్చేందుకు నటీన‌టులు ఆస‌క్తి చూపుతుండ‌డంతో పాటు సినిమాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ల‌భిస్తోంది. సినిమా ప్ర‌చారానికి వాయిస్ ఓవ‌ర్ కూడా దోహ‌దం చేస్తోంది.

టాలీవుడ్ కథానాయకులకు ఒక్కసారిగా జంతువుల మీద.. యంత్రాల మీద.. ప్రకృతి మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. సినిమాల్లో మనుషులకు కాకుండా వీటికి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు ‘మర్యాద రామన్న’ సినిమాలో రవితేజ ఒక సైకిల్‌కు గొంతు అందించారు. అంతకుముందు ‘గోదావరి’ సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కుక్కకు వాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి రవితేజ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. ఈ బాట‌లో తొలిసారిగా నాని.. ద‌గ్గుబాటి రానా కూడా వ‌స్తున్నారు.

నాని వాల్ పోస్ట‌ర్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అ!’ సినిమాలో అతను ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇదే సినిమాలో రవితేజ ఓ చెట్టుకు వాయిస్ ఓవ‌ర్ ఇస్తాడ‌ని నాని ప్ర‌క‌టించారు.

మరోవైపు రానా దగ్గుబాటి ఓ క‌న్న‌డ డ‌బ్బింగ్ సినిమాలో ఓ బస్సుకు వాయిస్ ఓవర్ ఇస్తుండంట‌. రాజరథం అనే. కన్నడలో ‘రంగి తరంగ’ సెన్సేషనల్ మూవీ తీసిన ఆకాశ్ భండారీ ఇప్పుడు ‘రాజరథం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కన్నడ.. తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా కూడా భాగస్వామి అని ఇంతకుముందే వెల్లడైంది. ఒక బస్సు చుట్టూ తిరిగే కథ అని.. ఆ బస్సుకు తానే వాయిస్ ఓవర్ ఇస్తున్నానని రానా ప్ర‌క‌టించారు.

వీళ్లే కాక చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్ త‌దిత‌ర న‌టీన‌టులు కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. వాయిస్ ఓవ‌ర్‌లో గాయ‌కులు, న‌టులు, హీరోయిన్లు త‌దిత‌రులు కూడా ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -