యంగ్ హీరో రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.గత కొంతకాలంగా వీరిద్దరికి సరైన హిట్లు లేవు. రామ్ ఇటీవలే హలో గురు ప్రేమ కోసమే సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే టెంపర్ తరువాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు. దీంతో ఈ సారి రామ్ తీసే సినిమాతో హిట్ కొట్టి ఎలాగైన రేస్‌లో నిలబడలని కసితో ఉన్నాడు పూరీ.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను కూడా విడుదల చేశారు. సినిమా టైటిల్‌ను ‘ఐస్మార్ట్ శంకర్’గా ప్రకటించారు.
ఇక రామ్ సిగిరెట్ తాగుతున్న లుక్‌ను విడుదల చేశాడు పూరీ. అయితే ఈ పోస్టర్‌ను ఊల్టా(రివర్స్)తో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. పోస్ట్‌ర్ ఊల్టా అయితే ఫర్వాలేదు కాని, సినిమా ఊల్టా కాకుండా చూసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని దర్శకుడు పూరి తెలిపారు. తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు. హీరోయిన్ ఛార్మీ ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహారిస్తుంది. మరి ఈ సినిమా అయిన వీరిద్దరికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’