Wednesday, May 1, 2024
- Advertisement -

పుష్ప లీక్‌లు..అదిరే అప్‌డేట్!

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో దీని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 ఆగస్టు 15న సినిమా విడుదల కానుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక రోజుకో అదిరే అప్‌డేట్, లీక్‌లతో పుష్ప 2 సినిమా వార్తల్లో నిలుస్తోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో జాతరకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా జాతర సన్నివేశంలో క్రేజీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడట. జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఇక తర్వలోనే జాతర ఫైట్‌ని చిత్రీకరిస్తున్నారట.

ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు దక్కగా అదే రేంజ్‌లో తెరకె్కిస్తున్నారు సుకుమార్. ఈ చిత్రానికి డిఎస్పీ సంగీతం అందిస్తుండగా ఫ‌హ‌ద్ ఫాసిల్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -