Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..కానీ!

- Advertisement -

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. బాబు తరపున లూథ్రా, శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇప్పటికే అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు చంద్రబాబు.

ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వగా తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో రిలీఫ్ లభించినట్లే చెప్పాలి. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన కండీషన్స్ రెగ్యులర్ బెయిల్‌కు వర్తిస్తాయని చెప్పడం కాసింత ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే ఆయన టీడీపీ సమావేశాల్లో పాల్గొనకూడదు, ఎలాంటి ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదు.

సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా దాదాపు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు చంద్రబాబు. ఇక చంద్రబాబు రెగ్యులర్ బెయిల్పై ఇరు వర్గాల వాదనలను సుదీర్గంగా విన్నది న్యాయస్థానం. అనంతరం రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -