Saturday, May 4, 2024
- Advertisement -

పుష్ప 2..సాంగ్ ప్రోమో వచ్చేస్తోంది!

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రంకు సీక్వెల్ పుష్ప 2 వస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఇప్పటికే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. ఏకంగా తక్కువ టైంలోనే 150 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమాలో సాంగ్ ప్రోమో రిలీజ్ కానుంది. పుష్ప పుష్ప అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమో ని రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించిన మేకర్స్ ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

బన్నీ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్‌తోనే రికార్డులు బ్రేక్ చేసిన బన్నీ…ప్రొమో సాంగ్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -