Saturday, May 4, 2024
- Advertisement -

SSMB29..టైటిల్ డేట్ ఫిక్స్!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాని దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజమౌళి – మహేష్‌ కాంబోలో తొలిసారి సినిమా వస్తుండగా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా ఈ మూవీ కోసం ఇప్పటికే పూర్తిగా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నారు మహేష్.

దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం, సాయి మాధవ్ బుర్రా మాటలని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్ డేట్ లాక్ అయింది.

మే 31న లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ జయంతి సందర్భంగా అనౌన్స్‌చేయనుండగా ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేయనున్నారట జక్కన్న. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -