Friday, May 17, 2024
- Advertisement -

పుష్ప..పుష్ప..పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు!

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ,ది రూల్. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి పుష్ప….. పుష్ప… పుష్ప… పుష్పరాజ్‌ టైటిల్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో సాంగ్‌ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ అబిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ కానుంది పుష్ప 2.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -