Friday, May 3, 2024
- Advertisement -

టీమిండియా.. జర జాగ్రత్త !

- Advertisement -

ప్రస్తుతం టీమిండియా టి20 వరల్డ్ కప్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింట్లో విజయం సాధించిన రోహిత్ సేన.. సెమీస్ కు అత్యంత చేరువలో ఉంది. ఇక సూపర్ 12 లో భాగంగా ఈ ఆదివారం చివరగా జింబాబ్వేతో తలపడనుంది టీమిండియా. జట్టు కూర్పు పరంగా రోహిత్ సేన అత్యంత పటిష్టంగానే ఉన్నప్పటికి జింబాబ్వే ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేసిన కంగు తినే అవకాశాలు ఉన్నాయని మాజీలు హెచ్చరిస్తున్నారు. .

ఎందుకంటే ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీలో చిన్న జట్లు పెద్ద టీమ్ లకు షాక్ ఇస్తూ సంచలనలు సృష్టిస్తున్నాయి. ఐర్లాండ్ జట్టు ఇంగ్లండ్ కు ఏవిధంగా షాక్ ఇచ్చిందో.. అదే విధంగా జింబాబ్వే జట్టు పాకిస్తాన్ కు అంతే షాక్ ఇచ్చింది. దీంతో కూనలను తక్కువ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన క్రీడా విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటికే టోర్నీ నుంచి నాకౌట్ దిశగా ఉన్న జింబాబ్వే టీమిండియాను ఓడించి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ పై గెలుపు మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, టీమిండియా ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని జింబాబ్వే కెప్టెన్ ఇర్విన్ చెప్పుకొచ్చాడు.

విరాట్ ఫుల్ ఫామ్ లో ఉన్నడని, అతన్ని ఎదుర్కోవడానికి మావద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని వ్యాఖ్యానించాడు. అయితే విరాట్ లాంటి గొప్ప ఆటగాడిని ఎదుర్కోవడం మా జట్టు బౌలర్లకు గొప్ప అవకాశం అని.. ఆ అవకాశాన్ని మా జట్టు పూర్తి వినియోగించుకుంతుందని జింబాబ్వే కెప్టెన్ ఇర్విన్ అన్నాడు. ఇక జింబాబ్వే ను తక్కువగా అంచనా వేసే ప్రసేక్తే లేదని టీమిండియా అల్ రౌండర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాలని, ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టును కోలుకొనివ్వకూడదు అని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మరి భారత్, జింబాబ్వే మద్య రేపు జరిగే ఆసక్తికర పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -