అర్జున్ రెడ్డి సినిమా తరువాత తెలుగులో అడల్ట్ కథలకు డిమాండ్ బాగా పెరిగింది.ఈ సినిమా తరువాత అలాంటి కథలు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువైయ్యాయి.మరో అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్యార్ ప్రేమ కాదల్.తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా విడుదల చేశారు.ఒక బుద్ధిమంతుడైన హీరో ఆధునిక అమ్మాయికి ప్రతిరూపంగా నిలిచే హీరోయిన్ సంప్రదాయంగా ఉండే హీరో తల్లి తండ్రులు వీళ్ళ మధ్య ఒక ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కించారు.
హరీష్ కళ్యాణ్ రైజా జంటగా నటించిన ఈ మూవీలో హీరో పాత్రను అమాయకంగా తీర్చిదిద్దిన తీరు బాగుంది.ఈ మధ్య హీరొయిన్ క్యారెక్టరైజేషన్ ను బోల్డ్ గా మలుస్తున్న దారిలోనే ఎలాన్ కూడా వెళ్ళాడు. దేనికి మొహమాట పడకుండా తనను ప్రేమించినవాడితో బెడ్ పంచుకోవడానికైనా వెనుకాడని పాత్రలో రైజా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ట్రైలర్‌ను చూస్తుంటే యూత్‌ని టార్గెట్ చేసుకుని కట్ చేసినట్లు తెలుస్తుంది.ఎలాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.ఇక ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.
