Thursday, May 2, 2024
- Advertisement -

చిరంజీవికి దిమ్మ తిరిగింది

- Advertisement -

ఆర్. నార‌య‌ణ మూర్తి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటు గుర్తింపు తెచ్చుకొని విప్ల‌వ‌త్మ‌క సినిమాలు చేసి పీపుల్ స్టార్‌గా ఎదిగాడు.తన మ‌న‌స్సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు చేప్పే నార‌య‌ణ మూర్తి మొన్న ఆ మ‌ధ్య నంది అవార్డుల విష‌యంలో కూడా త‌న అస‌హ‌నాన్ని బ‌హాటంగానే తెలియ‌చేశాడు.ఎదుటి వ్యక్తి ఎవరైనా, ఎంతటి వారైనా మనసులో ఉన్నది చెప్పేయడం ఆయనకి అలవాటు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది.ఓ సభలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి పీపుల్స్ స్టార్ షాక్ ఇచ్చినంత పని చేశారు.

దర్శకరత్న దాసరి నారాయణరావుపై ప్రముఖ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘తెరవెనుక దాసరి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ పార్క్ హయత్ లో అట్టహాసంగా జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్. నారాయణమూర్తి.. తన గురువు దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకున్నారు. అక్కడితో ఆగని ఆయన.. అక్కడున్న గెస్టులందరి మీద తలో కామెంట్ పడేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ”మన చిరంజీవి.. పేరుకు మెగాస్టారే. కానీ.. చెప్పుకోడానికి ఒక్క మెగా సినిమా కూడా ఆయన కెరీర్ లో లేదు. ఎన్టీఆర్‌కు, ఏఎన్నార్‌కు చెప్పుకోవడానికి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. శోభన్ బాబు, కృష్ణ లాంటోళ్లకు సంపూర్ణ రామాయణం, అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలున్నాయి. కానీ చిరంజీవి ముసలివాడయ్యాక తాను చేసిన గొప్ప సినిమాలు ఏవని చూసుకుంటే ఒక్కటి కూడా లేదన్నారు. అయితే ఇప్పుడు తీస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి” అంటూ బాంబు పేల్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -