Sunday, May 19, 2024
- Advertisement -

రామసేతు నిజమే ..తేల్చేసిన విదేశి మీడియా

- Advertisement -

రామసేతు. ఈ పదం వింటే ప్రతి హిందువు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతాడు.రాముడు సీతమ్మను తెచ్చుకోవడం కోసం రామేశ్వరం నుంచి లంకకు సముద్రంలో మార్గం నిర్మించుటకోసం వేసిన దారి.అయితే దీనిపై గత ప్రభుత్వాలు అదంతా ఏం లేదు.అంతా తూచ్ … రామసేతు మీదుగా సేతు సముద్రం ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించింది. అయితే రామసేతును మధ్యలో విరగ్గొట్టి నిర్మించాల్సి ఉండటంతో దేశవ్యాప్తంగా పలు హిందూ సంస్థలు దీనిపై తీవ్ర వ్యతిరేకతను ప్రకటించాయి.

కాని తాజాగా రామసేతు కొందరు వాదిస్తున్నట్లు… ఏదో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదని ఇది నిజంగా మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఒక టెలివిజన్‌సంస్థ స్పష్టంచేసింది. దీంతో రామసేతు ఒట్టి బూటకమని వాదిస్తున్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాకు చెందిన ఓ సైన్స్‌ ఛానల్‌ దీనిపై విపరీతమైన పరిశోధనలు నిర్వహించి తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనుష్కోడి ప్రాంతానికి, శ్రీలంకలోని మన్నార్‌ ప్రాంతానికి రాళ్లతో కూడిన నిర్మాణాన్ని ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తేల్చింది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది.

పక్కా ఆధారాలతో… అమెరికాకు చెందిన సైన్స్‌ ఛానల్‌ దీనికి సంబంధించి పరిశోధనలు చేపట్టింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఇది ప్రకృతి సిద్ధం కాదని మానవ నిర్మితంగా తేలిందని తెలిపింది. సముద్రంలోని ఇసుకపై రాతితో నిర్మాణాలు చేపట్టినట్టు పరిశోధనలో వెల్లడయింది. అయితే సాధారణ మానవులు ఇలాంటి నిర్మాణం చేపట్టలేదని పురాతత్వశాస్త్రవేత్త చెల్సియా అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో కోసం ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -