Monday, May 13, 2024
- Advertisement -

గాంధీన‌గ‌ర్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న మోదీ త‌ల్లి..

- Advertisement -

గుజ‌రాత్‌లోని 93 సీట్ల‌కు జ‌రుగుతున్న రెండో విడ‌త పోలింగ్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌ల్లి హీరాబా మోదీ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. చిన్న కుమారుడు పంక‌జ్ మోదీ, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్‌లోని ఆర్య‌భ‌ట్ట హై స్కూల్ పోలింగ్ కేంద్రానికి ఆమె హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం 90 ఏళ్ల‌కి పైగా వ‌య‌సున్న హీరాబా మోదీ ఓటు వేసిన త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చి, తాను ఓటు వేసినట్లుగా సిరా గుర్తును మీడియాకు చూపించారు.

‘గుజ‌రాత్‌కి మంచి జ‌ర‌గాలి’ అని హీరాబా మోదీ వ్యాఖ్యానించారు. ఉత్త‌ర, మ‌ధ్య గుజ‌రాత్ ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఈ పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంద‌ని అధికారులు చెబుతున్నారు. దాదాపు 2.22 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

ఇక నారాయణ్‌పురాలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా ఎన్నికల కేంద్రంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌, గాంధీనగర్‌ వసన్‌ గ్రామంలో కాంగ్రెస్‌ మాజీ నేత శంకర్‌సిన్హ్‌ వాఘేలా ఓటు వేశారు. పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ తల్లిదండ్రులు భరత్‌ పటేల్‌, ఉషా పటేల్‌ వీరంగంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -