Tuesday, April 30, 2024
- Advertisement -

‘తొలిప్రేమ’ హీరోయిన్‌కు బంప‌రాఫ‌ర్‌

- Advertisement -

టాలీవుడ్‌కు వ‌చ్చి ఐదారేళ్లు అయ్యింది.. చేసిన సినిమాలు మాత్రం కొన్నే. త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మాత్రం ‘తొలిప్రేమ’తో కొట్టేసింది. ఈ సినిమా కోసం బ‌క్క చిక్కి గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంది. ఆ హీరోయినే రాశీఖ‌న్నా. ‘తొలిప్రేమ’ హిట్‌తో ఈ అమ్మ‌డికి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మిళంలో మాత్రం మంచి ఆఫ‌ర్ రాశీకి వ‌చ్చేసింద‌ట‌.

జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన ‘టెంపర్’ను తమిళంలో హీరో విశాల్ రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో రాశీఖ‌న్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశారంట‌. మహేశ్‌బాబు ‘స్పైడర్’ సినిమాకు మురుగదాస్ దగ్గర స‌హాయ ద‌ర్శ‌కుడిగా పనిచేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం చేయ‌నున్నాడు. విశాల్ సొంత బ్యానర్.. లైట్ హౌజ్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను తీస్తున్నారు.

రాశీ ఇంత‌కుముందే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేసింది. ఇప్పటికే తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది. అధర్వ, సిద్దార్థ్, జయం రవి ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించ‌డానికి ఒప్పేసుకుంది. ఇప్పుడు ఇది నాలుగో అవ‌కాశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -