Saturday, May 11, 2024
- Advertisement -

ఏమ‌మ్మా ఎంట్రీ ఇచ్చిన ద‌ర్శ‌కుడికే రిట‌ర్మైంట్ ఇవ్వమ‌న్నావ్‌..

- Advertisement -

సినిమాల్లోకి రావాల‌ని ఎంతోమందికి ఉన్నా అదృష్టం క‌లిసిరావాలంటారు. ఎంత అందం.. హైట్‌.. న‌ట‌న‌లో ప్ర‌తిభ ఉన్నా అవ‌కాశాలు ల‌భించ‌వు. అలాంటిది ఒక్క సినిమానే పెద్ద ద‌ర్శ‌కుడి చేతిలో వ‌చ్చి ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిన న‌టి రాధికా ఆప్టే. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న సినిమా ‘ర‌క్త‌చ‌రిత్ర‌’తో రాధికాను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశాడు.

ఆ త‌ర్వాత రాధికాఆప్టేకు మంచి మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌చ్చి ఇప్పుడు మంచి క్రేజీ ఉన్న హీరోయిన్‌గా మారింది. పెద్ద పెద్ద హీరోల‌తో సినిమాలు చేస్తోంది. ఏకంగా ర‌జ‌నీకాంత్‌, బాల‌కృష్ణ‌ల‌తో న‌టించే అవ‌కాశం ఈ అమ్మ‌డుకు ద‌క్కింది. అదంతా రామ్‌గోపాల్ వ‌ర్మ పుణ్య‌మే. అలాంటిది ఆమె రామ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు షాకిచ్చేలా రాధికాఆప్టే వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక షోలో రాధికా ఇప్పుడు ఉన్న నటులు, దర్శకుల్లో ఎవరు రిటైర్మెంట్ (ప‌ద‌వీ విర‌మ‌ణ‌) తీసుకోవాలి అని రాధికాను ప్ర‌శ్నిస్తే ఆశ్చ‌ర్య‌క‌ర స‌మాధానం చెప్పింది. ఏ మాత్రం తడుముకోకుండా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు రిటైర్మెంట్ ఇవ్వాల‌ని చెప్పింది. ఎందుకు ఈ విధంగా జ‌వాబు చెప్పిందో రాధికాకే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -