- Advertisement -

రాజ్‌తో సామ్ పెళ్లి..వైరల్‌ న్యూస్!

- Advertisement -

నటి సమంత – రాజ్‌ నిడిమోరు వివాహం జరిగిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు తగ్గట్టుగానే రాజ్ నిడిమోరూకు మాజీ భార్య శ్యామాలి డే ఒక క్రిప్టిక్ పోస్టును షేర్ చేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన చేసింది సమంత.

ఈ ఏడాది మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాఫ్ట్ లాంచ్’ తరహాలో సమంత–రాజ్ నిడిమోరు కలిసి ఉన్న ఫోటోలతో ఊహాగానాలకు ఇంధనం పోశారు. మొదట కేవలం రూమర్స్‌గా మొదలైనవి, తర్వాత సమంత షేర్ చేసిన ఫోటోలు ఈ ఊహాగానాలను మరింత బలపరిచాయి.

ఇక ఈ ఉదయం నుంచి ఇద్దరూ ఇషా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్నారన్న వార్తలు మరింత ప్రచారం పొందుతున్నాయి. అధికారిక ప్రకటన రాకముందే, రాజ్ మాజీ భార్య శ్యామాలి డే “Desperate people do desperate things” అనే సందేశాన్ని షేర్ చేశారు.

‘ది ఫ్యామిలీ మాన్’ సృష్టికర్త రాజ్ నిడిమోరూకు మాజీ భార్య శ్యామాలి డే, ఇలాంటి రూమర్ల సమయంలో తరచూ క్రిప్టిక్ పోస్టులు పెట్టడం అలవాటుగా ఉంది. ఆదివారం కూడా అలాంటి ఒక సందేశాన్ని షేర్ చేశారు. “Desperate people do desperate things” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.

శ్యామాలి డే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, రాజ్‌ను 2015లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ 2022లో విడిపోయారని సమాచారం. సమంత, రాజ్ నిడిమోరు పరిచయం 2021లో ‘ది ఫ్యామిలీ మాన్ 2’ సమయంలో మొదలైంది. ఆ తర్వాత Citadel: హనీ బన్నీ (2024), త్వరలో విడుదలకానున్న రక్త బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్‌డమ్ ప్రాజెక్టుల ద్వారా ఇద్దరూ కలిసి పనిచేశారు. ఈ వృత్తిపరమైన అనుబంధం క్రమంగా వ్యక్తిగత బంధంగా మారిందని ప్రచారం. సమంత ముందుగా నాగ చైతన్యతో వివాహం చేసుకున్నారు. 2022లో విడిపోయారు. అనంతరం చైతన్య 2024లో నటి సోభితా ధులిపాలను పెళ్లి చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -