- Advertisement -

వక్ఫ్ ఆస్తుల నమోదు గడువు పొడిగింపుపై సుప్రీం

- Advertisement -

ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల నమోదు కోసం ఇచ్చిన ఆరు నెలల గడువు పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం ఇలాంటి ఉపశమనాన్ని కోరేందుకు సరైన వేదిక వక్ఫ్ ట్రైబ్యునల్ అని న్యాయమూర్తులు దిపాంకర్ దత్తా, ఆగస్టిన్ జార్జ్ మసీహ్ స్పష్టం చేశారు.

అప్లికెంట్లకు చట్టంలోనే ట్రైబ్యునల్ ముందు ఉపశమనం పొందే మార్గం ఉంది. డిసెంబర్ 6తో ఆస్తుల నమోదు చివరి తేదీ ముగియనుండటంతో, వారు అప్పటి వరకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు అని సుప్రీం కోర్టు పేర్కొంది.అప్లికెంట్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ, సమస్య కేవలం ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేయడానికే పరిమితం కాకుండా, వక్ఫ్ ఆస్తుల డిజిటైజేషన్‌తో కూడా సంబంధం ఉందని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ విచారణ జరిపేలోపే డిసెంబర్ 6 గడువు ముగిసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ—“నిజమైన సాంకేతిక లేదా ప్రాసీజరల్ సమస్యలు ఎదురైతే, ట్రైబ్యునల్‌ను నేరుగా ఆశ్రయించవచ్చు. పోర్టల్‌లో సమయం ‘ఫ్రీజ్’ అయితే దానికి మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేసింది. UMEED (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) కేంద్ర పోర్టల్ వక్ఫ్ ఆస్తులను రియల్‌టైమ్‌లో అప్‌లోడ్ చేయడానికి, ధృవీకరించడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్.

భారతదేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుతత, ప్రజా భాగస్వామ్యం పెంపు. ఉమీద్ పోర్టల్ ప్రధాన లక్షణాలు:..జియోట్యాగ్‌తో కూడిన డిజిటల్ ఇన్వెంటరీ సృష్టి. ఆన్‌లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్,పారదర్శకమైన లీజింగ్ & యూజేజ్ ట్రాకింగ్,GIS మ్యాపింగ్, ఇతర ఈ-గవర్నెన్స్ సాధనాలతో అనుసంధానం,ధృవీకరించిన రికార్డులకు సార్వజనిక ప్రాప్యత,వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పెద్ద మార్పుకు దారితీయగల ఈ కేంద్ర పోర్టల్ దేశవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -