- Advertisement -

తొలిసారి పబ్లిక్‌లో పలాష్!

- Advertisement -

క్రికెటర్ స్మృతి మంధానతో వివాహం వాయిదా పడిన తర్వాత, దర్శకుడు పలాష్ ముచ్చల్ తొలిసారిగా పబ్లిక్‌లో కనిపించారు. ఎయిర్‌పోర్టులో స్పాట్ అయిన ఆయన, అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లను పూర్తిగా పట్టించుకోకుండా ముందుకు నడిచిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయనతో పాటు తల్లి, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23, 2025, ఆదివారం మహారాష్ట్రలో జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. వైరల్ వీడియోలో పలాష్ ముచ్చల్ ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. చేతిలో ఒక పుస్తకం మరియు మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నారు.

పెళ్లి వాయిదా పడిన కొన్ని గంటలకే పలాష్ వైరల్ ఇన్ఫెక్షన్ మరియు తీవ్రమైన ఆమ్లత సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.వివాహ వాయిదా గురించి స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాకు వెల్లడిస్తూ..ఈరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో స్మృతి తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కొంతసేపు వేచి చూశాం, అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో అంబులెన్స్ పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్‌లో ఉన్నారు అని చెప్పారు.

స్మృతి తన తండ్రికి చాలా దగ్గర. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని అనిశ్చితకాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. డాక్టర్లు ఆయన ఇంకా కొంతకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. తన తండ్రి ఆరోగ్యం బాగుపడాలని స్మృతి కోరుకుంటోంది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -