Tuesday, May 14, 2024
- Advertisement -

‘రాజుగాడు’ మూవీ రివ్యూ

- Advertisement -

లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని హీరోగా ‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు రాజ్‌తరుణ్‌. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తదితర చిత్రాల్లో నటించారు.గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేని రాజ్ త‌రుణ్‌ ‘రాజుగాడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం!

కథ: రాజు చిన్నప్పటి నుంచి విచిత్రమైన జబ్బుతో బాధపడుతుంటాడు. తనకు తెలీకుండానే దొంగతనాలు చేస్తుంటాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం ఉండదు. పెద్దయ్యేకొద్ది అలవాటు పెరుగుతుందే కానీ తగ్గదు. రాజు తన్విని ప్రేమిస్తాడు. తన జబ్బు గురించి తెలిస్తే తన్వి ఎక్కడ దూరమవుతుందోనని ఆ విషయం దాస్తాడు. కాకపోతే పది రోజుల పాటు రాజు..తన్వి తాతగారు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నాగినీడుకి దొంగలంటే ఇష్టముండదు. ఆ ఊర్లో ఎవరు దొంగతనం చేసినా చేతులు నరికేస్తుంటాడు. అలాంటి ఇంట్లో తానో దొంగ అని తెలీకుండా రాజు ఏం చేశాడు? ఆ ఇంట్లో వారి మనసులను ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ.

విశ్లేష‌ణ‌: ‘భలేభలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ సినిమాల కాన్సెప్ట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో వినోదం పండించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ‘రాజుగాడు’ చిత్రంలో దర్శకురాలు సంజన దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. కథ నడిచేకొద్ది ఇంకాస్త వినోదం ఆశిస్తాడు ప్రేక్షకుడు. కానీ ఆ వినోదాన్ని అందివ్వడంలో దర్శకురాలు, నటీనటులు విఫలమయ్యారు.ద్వితియార్థం మరీ సాగదీతగా అనిపిస్తుంది. నాగినీడు ఇంట్లో జరిగే వ్యవహారాలు అంతగా వినోదాన్ని పంచవు. పతాక సన్నివేశాల్లో రాజు పాత్రతో వినోదం పండించేందుకు దర్శకురాలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.

న‌టీన‌టులు: రాజ్‌తరుణ్‌లో ప్రేక్షకుడికి నచ్చేదే ఎనర్జీ. ఎలాంటి పాత్రైనా ఎంతో ఉత్సాహంతో చేస్తాడు. కానీ ఆ హుషారు ఈ సినిమాలో కన్పించలేదు. అతని చుట్టూ ఉన్న పాత్రలు కూడా వినోదాన్ని పండించలేకపోయాయి. రాజ్‌, అమైరా కెమిస్ట్రీ అంతగా పండలేదు. ఇందులో రాజ్‌తరుణ్‌కు తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్‌ నటన ఆకట్టుకుంటుంది. నాగినీడు, రావురమేశ్,‌ సితార, ప్రవీణ్ ‌ అనుభవజ్ఞులే కాబట్టి తమ పాత్రలను సాఫీగా నడిపించారు. గోపీసుందర్ అందించిన బాణీలు అందులో సాహిత్యం బాగున్నాయి. అయితే కథలో బలం లేకపోవడంతో మంచి కాన్సెప్ట్ ‌ఎంచుకున్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా తెరపైకి తీసుకురాకపోవడంతో రాజుగాడు అందరికీ నచ్చేలా లేడు.

బోట‌మ్ లైన్ : రాజ్ త‌రుణ్ మ‌రోసారి ప్రేక్ష‌కుల మనసును దొంగిలించలేక‌పోయాడు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -