Friday, May 17, 2024
- Advertisement -

‘రంగుల రాట్నం’ ట్రైల‌ర్ విడుద‌ల‌

- Advertisement -

అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కుర్ర న‌టుడు రాజ్ త‌రుణ్‌. త‌న‌కు అరంగేట్రం ఇచ్చిన సంస్థ‌లోనే రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా ‘రంగుల రాట్నం’. శ్రీరంజ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా నటించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 14వ తేదీన వ‌స్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల చేశారు.

త‌ల్లి చాటు బిడ్డగా రాజ్ త‌రుణ్ ఉంటాడు. త‌ల్లి చెప్పిన మాదిరిగా అమ్మాయిని ప్రేమించ‌డం చేస్తుంటాడు. త‌ల్లి చూపించిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి త‌ల్లి చెప్పితే త‌న అల‌వాట్ల‌ను మానుకోడు. కానీ ల‌వ‌ర్ చెబితే ష‌ర్ట్ నుంచి సిగ‌రెట్ మానుకోవ‌డం.. గుడికి వెళ్ల‌డం.. ఇలా చివ‌రికి టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోతాడు. ఈ విధంగా ల‌వ్‌కు ముందు ల‌వ్‌కు త‌ర్వాత సినిమా ట్రైల‌ర్ ఉంది. ఈ సినిమాను స్థానిక ప్రాంతాల్లోనే షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్‌, తెర‌పై ఫీల్‌గుడ్ సినిమాగా నిలిచే అవ‌కాశం ఉంది. ఈ సినిమా సంక్రాంతి బ‌రిలోకి రానుంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో కొంచెం అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పైగా స‌రైన విజ‌యాలు లేక బాధ‌ప‌డుతున్న రాజ్‌త‌రుణ్‌కు సంక్రాంతి కాంపిటీష‌న్‌తోనైనా విజ‌యం ద‌క్కే అవ‌కాశం ఉంది. గ‌తేడాది శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి మాదిరి రాజ్‌ తరుణ్ త‌న సినిమాతో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఉయ్యాల జంపాల సూప‌ర్ హిట్‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు రాజ్‌త‌రుణ్‌.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -