Wednesday, May 15, 2024
- Advertisement -

రాజా ది గ్రేట్‌ సెన్సార్ రివ్యూ..!

- Advertisement -

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రాజా ది గ్రేట్‌. బెంగాల్ టైగ‌ర్ తర్వాత రవితేజ ఏ సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పట్లో రవితేజ సినిమాలకు గుడ్ బై చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పలేదని.. రాజా ది గ్రేట్‌ సినిమాని మొదలు పెట్టారు. ఇటివలే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ తర్వాత మూవీకి U/A స‌ర్టిఫికేట్ ఇచ్చారు. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప‌టాస్, సూప్రీమ్ సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ బయటకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో రవితే పూర్తిగా అంధుడిగా నటిస్తుండగా.. ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మెహ్రీన్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇక సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.. సినిమా చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు మంచి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ రాజా ది గ్రేట్ ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక రవితేజ అంధుడిగా ఆ పాత్రలో అదరగొట్టాడని సెన్సార్ టీం చెప్పింది. ఇక ఈ సినిమాకి డైరెక్షన్, రవితేజ, మెహ్రిన్‌, సీనియ‌ర్ న‌టి రాధిక ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే.. ఈ నెల 18 వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -