- Advertisement -
బాహుబలి మూవీతో ప్రభాస్ స్థాయి రేంజ్ టాలీవుడ్ నుండి నేషనల్ స్థాయికి వెళ్ళింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ హీరోకు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్ నుండి కూడా ప్రభాస్ కి ఆఫర్లు వస్తున్నట్టు ఈ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ హీరోకి నేషనల్ మీడియా నుండి పిలుపు వచ్చిందట.
జాతీయ స్థాయిలో ప్రభాస్ కి వున్నట్టువంటి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒక నేషనల్ మీడియా ప్రభాస్ ని ముంబై లో జరిగే రావణ సంహారం కార్యక్రమానికి ఆహ్వానించింది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా వుండి రాలేనని చెప్పినప్పటికి వారు ప్రభాస్ ని వెంటబడి మరీ రావాలని కోరుతున్నట్టు సమాచారం.
అయితే రాజమౌళి మాత్రం ప్రభాస్ ను బయటకు పంపడానికి అంగీకరించట్లేదని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించింది.
Related