Monday, April 29, 2024
- Advertisement -

రాజమౌళి గురించి ఊహించని సంగతులు!

- Advertisement -

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎస్.ఎస్.రాజమౌళి తన పదో సినిమాకి నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచన్నాకి చూపించిన దర్శకధీరుడు రాజమౌళి నేడు (అక్టోబర్ 10) పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ .. రాజమౌళి గురించి మీకు తెలియాని విషయాలు చూద్దాం.

* రాజమౌళి కుర్రోడిగా ఉన్నప్పుడు సినీ హీరో అవ్వాలని కలలు కనేవారు. ఆ విషయం ఎవరికైనా చెబితే నవ్వుతారని రహస్యంగా పూజలు చేసేవారు. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మెల్లగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు.

* ప్రతి ఫ్రేమ్ ని చెక్కుతాడని రాజమౌళికి జక్కన్న అని పేరు వచ్చింది. ఈ పేరుతో మొదటిసారి పిలిచింది నటుడు రాజీవ్ కనకాల. శాంతి నివాసం సీరియల్ డైరక్ట్ చేసేటప్పుడే ఈ పేరు పెట్టారు.

* రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చెయ్యమని ముందుగా చిరంజీవి రాజమౌళి ని కోరారు. మొదటి సినిమా లవ్ స్టోరీ అయితే బాగుంటుందని చిరు చెబితే.. ప్రేమకథ నేను చెయ్యను .. తర్వాతి సినిమా చేస్తాను అని మగధీర తీశారు.

* యమదొంగ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలనీ రాజమౌళి అనుకున్నారు. ఎందుకనో అప్పుడు అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పటివరకు మళ్లీ వారిద్దరూ కలవలేదు.

* కొన్నేళ్ళక్రితం రాజమౌళి విశ్వామిత్ర బ్యానర్ ని స్థాపించారు. ఆ బ్యానర్లో సినిమాలు నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఈ సంస్థ నుంచి ఒక సినిమా కూడా రాలేదు.

* అల్లరి నరేష్, రాజీవ్ కనకాల నటించిన విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాను ఎస్.ఎస్.రాజమౌళి సమర్పించారు. దర్శకధీరుడు సమర్పకుడిగా కనిపించిన తొలి సినిమా ఇది.

* 2011, డిసెంబర్ 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు భార్య రమతో కలిసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద రాజమౌళి ట్రాఫిక్ నియంత్రించారు. తాగి వాహనాలను నడపవద్దని పామ్లెట్స్ ని పంపిణీ చేశారు. 

* సంపూర్ణేష్ నటించిన హృదయకాలేయం సినిమా పోస్టర్స్ ని చూసి “మంచి ప్రయత్నం. బాగా కష్టపడుతున్నాడు” అని రాజమౌళి చేసిన ఒక కామెంట్ ఆ చిత్రానికి ప్రాణం పోసింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి, సంపూ హీరో కావడానికి ప్రధాన కారణం అయింది.

Related

  1. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?
  2. ఎన్టీఆర్ ని రాజమౌళి ఎందుకు తిట్టాడంటే?
  3. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  4. చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -