Tuesday, May 14, 2024
- Advertisement -

‘స్పైడర్’ మూవీపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

- Advertisement -

మహేష్ బాబు హీరోగా.. ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ సినిమా బుధవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన ఫాలోయింగుకు, ఆయన సినిమాకు ఉన్న డిమాండుకు ఏ మాత్రం తగ్గకుండా ‘స్పైడర్’ చిత్రాన్ని రికార్డు స్థాయి థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. మహేష్ బాబు కెరీరిలోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందని.. కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహేష్ బాబు ‘స్పైడర్’ మూవీ బాహుబలి రికార్డులను కూడా అధిగమించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.

తన మనసులో ఏది ఉంటే అది తడుముకోకుండా బయటపెట్టే రాజమౌళి… మహేష్ బాబు-మురుగదాస్ సినిమాపై తనకు ఉన్న లవ్, రెస్పెక్ట్ పై విధంగా బయట పెట్టారు. ఇక త్వరలో మహేష్ తో రాజమౌళి సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో రాజమౌళి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -