Sunday, May 19, 2024
- Advertisement -

షూటింగ్ షూరు చేసిన రాజ‌మౌళి

- Advertisement -

బాహుబ‌లి వంటి చారిత్రాత్మక చిత్రం త‌రువాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం RRR(వర్కింగ్ టైటిల్‌).యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఇటీవ‌లే ప్రారంబోత్స‌వం జ‌రుపుకుంది.ఇక ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు నుంచే మొద‌లు కానుంది.ఈ విష‌యాన్ని రాజమౌళియేస్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.ఈ సందర్భంగా సెట్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దిగిన ఓ ఫోటోను ఆయన పోస్టు చేశారు.ఈ ఫోటోలో మ‌ధ్య రాజ‌మౌళి ఉండ‌గా ,అటు ప‌క్కా,ఇటు ప‌క్కా రాహ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌లు ఉన్నారు.

రామ్ చ‌ర‌ణ్ త‌న పాదాల‌కు చెప్పులు కూడా లేకుండా ఉండ‌టంతో మొద‌ట సినిమాలోని పోరాట స‌న్నివేశాలను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి కాలేదు.కియారా అద్వానీ,కీర్తి సురేష్‌ల‌ను హీరోయిన్లుగా తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతుంది.సినిమా రెగ్యూల‌ర్ ఫూటింగ్ మొద‌లు కావ‌డంతో చిత్ర యూనిట్‌కు ప‌లువురు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.డివివి దాన‌య్య ఈ సినిమాను 2019 చివ‌రికి విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=2FvAnVkVuJ0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -