Wednesday, May 15, 2024
- Advertisement -

ఇక అన్నీ అక్కడే

- Advertisement -

చాలా రోజుల తర్వాత.. హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయంలో ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.పేరుకు వృద్ధి రేటుపై చర్చ అని చెబుతున్నా.. వీలైనంత త్వరగామంత్రుల కార్యాలయాలు, ఇతర ఆఫీసులన్నీ విజయవాడ, గుంటూరుకు షిప్ట్ చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది.

విజయవాడలో త్వరలో జరగనున్న కలెక్టర్ల సదస్సుపైనా.. బాబు అధికారులతో డిస్కస్ చేశారట. రూలింగ్ కు కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులకు విజయవాడ దారికి తెచ్చుకోవాలంటే.. ముందు అధికారులను హైదరాబాద్ నుంచి తరలించడమే మంచిదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. కలెక్టర్ల సదస్సును విజయవాడ లో నిర్వహించి ఉద్యోగులకు కచ్చితమైన డైరెక్షన్ ఇవ్వాలన్నది బాబుగారి థాట్ అని టాక్ వినిపిస్తోంది.

కచ్చితంగా చెప్పాలంటే.. కలెక్టర్ల సదస్సుతో మొదలు పెట్టి.. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవాడలోనే నిర్వహించేలా చూడాలన్నదే బాబు అంతిమ లక్ష్యంగా సమాచారం. అందుకే.. స్టెప్ బై స్టెప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఏపీ రాజకీయవర్గాలంటున్నాయి.

అయితే.. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నపుడు.. కనీసం ఇంకో ఎనిమిదేళ్లు ఆ అవకాశాన్ని అనుభవించే చాన్స్ ఉన్నపుడు.. ఇప్పుడే బాబు ఎందుకు తొందరపడుతున్నారన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఓ ఆరాటంతో పాటు..మరో భయం ఉందన్న ముచ్చట వినిపిస్తోంది.

 ఆంధ్రా నుంచే పరిపాలన చేస్తున్నామన్న క్రెడిట్ సొంతం చేసుకోవాలన్నది ఆరాటమైతే.. హైదరాబాద్ లో ఫోన్ టాపింగ్ భయం ఇంకా బాబును వీడలేదన్నది మరో కారణమని విశ్లేషణలు మొదలయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -