Friday, May 10, 2024
- Advertisement -

‘బాహుబలి’ కి వంద రెట్ల సినిమా చేస్తానంటున్న రాజమౌళి!

- Advertisement -

ఇప్పటికే బాహుబలి విషయంలో రకరకాల వ్యూస్ ఉన్నాయి. ఏ తె లుగు దర్శకుడూ చేయనటువంటి సాహసం చేస్తున్నాడు రాజమౌళి. ఆయన ప్యాసన్ కొద్దీ సినిమాను చేస్తున్నట్టుగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఇది సేఫ్ సబ్జెక్టా కాదా.. అనే విషయాన్ని పక్కనపెట్టేసి వందల కోట్ల పెట్టుబడితో ఈ సినిమాకు భారీ తనం తీసుకొచ్చారు. ఒక పార్టు అనుకొన్న సినిమాను రెండు పార్టులుగా తీశారు.

ఇలా రకారకాల మార్పులతో సినిమాను మూడు సంవత్సరాల్లో ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. ఇంకా బాహుబలిరెండో పార్టుకు సంబంధించి 60 శాతం షూటింగ్ జరగాల్సి ఉందట. తొలి పార్టు విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో రాజమౌళి ఈ విషయాలన్నింటినీ వివరించాడు. మరి ఇప్పుడు రాజమౌళి మరో విషయాన్ని కూడా ప్రకటించాడు .తన దగ్గర బాహుబలికి వందరెట్ల స్థాయి సబ్జెక్ట్ ఉందని ఆయన అంటున్నాడు.

అదే మహాభారతం. ఆ ఎపిక్ ను తెరకెక్కించాలనేది తన కల అని రాజమౌళి అంటున్నాడు.  మహాభారతాన్ని తెరకెక్కించడం గురించి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కు కూడా ఆసక్తి ఉందని రాజమౌళి అన్నాడు. తామిద్దరం కలిసినప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుకొన్నామని కూడా ఆయన వివరించాడు. మరి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు అది. బాహుబలికి వంద రెట్ల సినిమా అంటున్నాడు. మరి ఎన్నటికి తెరకెక్కుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -