Saturday, May 18, 2024
- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో కేసిఆర్‌, బాబు రాజీ నిజమేనా?!

- Advertisement -

ఓటుకు నోటు కేసు గురించి గత మూడు, నాలుగు రోజులుగా… దాదాపు అందరిలోనూ ఒకటే వాదన… ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాజీపడ్డారంటా? ఇక కేసు ఏం లేదంట? చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో రాజీ చేసుకొచ్చారంట? అని ఎవరి నోట చూసినా ఇదే చర్చ..

మరి అది నిజమా? తెలుగు సమాజ భవిష్యత్తును, తెలుగు వారి ప్రతిష్టను, తెలుగు ఆత్మాభిమానాన్ని, తెలుగు సమాజం సిగ్గుపడేలా జాతీయ స్థాయిలో ఈ కేసును తీసుకెళ్ళి రచ్చ చేశారు. సాక్ష్యాధారాలతో బయటపడిన ఇంత పెద్ద పొలిటికల్ స్కాం మన భారతదేశంలోనే మొదటిది.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు నువ్వా నేనా! అన్న విదంగా కేసులు పెట్టుకుంటూ రోజూ వార్తల్లో మొదటి పేజీల్లో నిలిచారు. అభివృద్దిని పక్కన పెట్టి ఇదే రాష్ట్రాలకు వచ్చిన పెద్ద సమస్య అన్నట్లు వ్యవహరించారు. ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా చేశారంటూ పేర్కొన్నారు. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్దమై రెడ్ హ్యాండెడ్‌గా డబ్బుతో పట్టుబడ్డారు. మరి ఇంత పెద్ద కేసులో ఇంత రచ్చ చేసుకుని కేసిఆర్, చంద్రబాబు రాజీ పడితే సరిపోతుందా? దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని కేసును కొట్టేస్తుందా! అన్నది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. ఇక ఈ కేసు బలహీనమైందా అన్న వాదనలో కూడా పెద్ద పస లేదు.

తెహల్కా.కామ్, రాజ్‌దీప్ సర్దేశాయ్ నేతృత్వంలో చేసిన స్టింగ్ ఆపరేషన్లను పార్లమెంటు, కోర్టులు చాలా తీవ్రంగా తీసుకున్నాయి. కేవలం లక్ష రూపాయలు తీసుకున్నందుకు బంగారు లక్ష్మణ్ ఏమయ్యారో అందరికి తెలిసిందే. అణు ఒప్పందం కోసం పార్లమెంట్‌లో ఎంపీలను కొనేందుకు 2008లో నోట్ల కట్టలు కుమ్మరించారు. ఈ కేసులో బీజేపి అత్యంత శక్తివంతుడు, అద్వాని అనుచరడు సుదీంద్ర కులకర్ణి ఇంకా కొంతమంది జైళ్ళకు వెళ్ళారు. ఇంకా ఈ కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది.  ఈ కుంభకోణం లోక్‌సభలో కేవలం ప్రశ్నలు అడిగినందుకు 11 మంది ఎంపీలు డబ్బు తీసుకున్నారని ఒక మీడియా జరిపిన స్టింగ్ ఆపరేషన్‌‍లో వీరంతా పదవులు కూడా పోగొట్టుకున్నారు. కేవలం మీడియా సంస్థలు జరిపిన స్టింగ్ ఆపరేషన్‌తోనే శిక్ష పడితే.. ఇక కేసులో కోర్టులు ఎలా వ్యవహరిస్తాయి. ఇక్కడ ఆధారాలుగా డబ్బు,ఆడియోలు, వీడియోలతో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. 

ఇలాంటి తరుణంలో ఈ మొత్తం కేసు వ్యవహారాన్ని కేసిఆర్ ఎలా వ్యవహరిస్తారో అని చాలా ఉత్కంఠంగా తెలుగు సమాజం ఎదురుచూస్తోంది. కేసిఆర్ చివరిదాకా తీసుకెళతారా? లేక ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లు రాజీపడి కేసును మూసివేస్తారా? అన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. ఒకవేళ కేసిఆర్ రాజీపడితే..? దాని ఎఫెక్ట్..  తెలంగాణలో చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు దీనిపై ఓ కన్నేసి ఉంచారని సమాచారం. సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ఈ కేసులో కేసిఆర్‌ వెనుకంజ వేశారని తీవ్ర ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కేసిఆర్‌పై ఒత్తిడి తెచ్చి కేసును బలహీనపరిచారని అందరి వాదన. ఇదే నిజమైతే టిఆర్‌ఎస్‌కు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 

మరి కేసిఆర్ ఇప్పుడున్న ప్రచారం ప్రకారం రాజీ పడతారా? లేక రాజీ పడిపోయారో? తెలియాల్సి ఉంది.         

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -