- Advertisement -

జ‌న‌సేన‌పై చిరు కీల‌క వ్యాఖ్య‌లు….

- Advertisement -

2019 ఎన్నిక‌లకు ఏడాదిన్న‌ర్ర మాత్ర‌మే గ‌డువు ఉండ‌టంతో ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ నిత్యం ప్ర‌జ‌ల‌మ‌ధ్య‌న ఉన్నారు. అధికార టీడీపీ పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను పూర్తి చేసి మ‌రో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చూస్తోంది. మ‌రో వైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఈ సారి ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ని ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇటీవ‌లే ఉత్త‌రాంధ్ర‌లో మూడు రోజుల పాటు ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో ఎక్కువ‌గా ప్ర‌జారాజ్యంపార్టీ, చిరంజీవిగురించే మాట్లాడారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఎందుకు ఇవ్వ‌లేదో ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తారో లేకా ఒంట‌రిగా పోటీచేస్తాడా అన్న‌ క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో ప‌వ‌న్ ఒంట‌రిగానా లేకా మ‌ద్ద‌తు ఇస్తారా అన్న‌ది గంద‌ర‌గోలంగా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కార‌నంగానే ఓడిపోయామ‌ని ఇప్పుడుకూడా అన‌వ‌స‌రంగా ప‌వ‌న్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని వైసీపీ భావిస్తోంది. జనసేనతో కలిసి పోరాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నేతపై ఉన్న కేసుల వల్లే గత ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకోలేదని పవన్ చెప్పారు. ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ కేసుల‌నుంచి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌తారా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే టీడీపీ కేసుల‌పై త్వ‌ర‌గా విచార‌న జ‌ర‌గ‌కుండా అడ్డుపుల్ల వేయ‌చ్చు. ఇప్పుడుకూడా కూడా దాదాపు అదే పరిస్థితి ఉండొచ్చు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చూస్తే చంద్ర‌బాబుతోనే ప‌వ‌న్ దోస్తీ కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. బీజేపీతో పొత్తు అనేది ప్రత్యేక హోదా అంశంతో ముడి పడి ఉంది. కాగా, వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తారనే విషయమై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో తమ్ముడు చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తాడని చిరంజీవి సన్నిహితుల వద్ద చెప్పారట. జనసేన విషయమై చిరంజీవి చెప్పినట్లుగా ప్రచారంలోకి వచ్చిన విషయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల నాటికి చిరు కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి, జనసేనలో చేరతారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -