Sunday, May 12, 2024
- Advertisement -

ఏప్రిల్ 13న 2.ఓ, ఆగ‌స్టు 15 కాలా సినిమాలు

- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా క‌బాలి త‌ర్వాత ఒక్క‌టీ రాలేదు. క‌బాలీ ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైనా కొంచెం నిరాశ ప‌రిచింది. ఇప్పుడు అత‌డి సినిమాలు ఎప్పుడెప్పుడు వ‌స్తాయా అని ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోబో సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో దానికి సీక్వెల్ 2.ఓ తీస్తున్నారు. ఈ సినిమాలో అక్ష‌య్‌కుమార్ ప్ర‌తి నాయ‌క పాత్ర పోషిస్తున్నాడు.

ఈ ఏడాది దీపావళికి ‘2.ఓ’ను విడుద‌ల చేయాల‌ని ప్రయత్నించినా కుదరలేదు. జనవరి 25న విడుదలకు ప్లాన్ వేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ ప‌ని ఈ పని అంటూ ఆల‌స్య‌మైంది. దాదాపు రూ.400 కోట్ల భారీ వ్య‌యంతో సినిమాను తీస్తున్నారు. ఏ ఆర్ ర‌హ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవ‌ల దుబాయ్‌లో సినిమా పాట‌ల విడుద‌ల అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

మరోపక్క ‘కాలా’ విడుదల తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది రజనీ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. అయితే ‘2.ఓ’, ‘కాలా’ చిత్రాల విడుదల తేదీలు ఖరారైనట్లు సమాచారం. తమిళ న్యూ ఇయర్‌ సందర్భంగా 2018 ఏప్రిల్ 13వ తేదీన ‘2.ఓ’ను, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ‘కాలా’ సినిమాలు విడుదల చేయాలని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది రజనీ రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -