Tuesday, May 21, 2024
- Advertisement -

2.0 టీజ‌ర్ విడుద‌ల‌…మామూలుగా లేదుగా…

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.ఓ టీజర్ ఈరోజు విడుదలైంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి.

భారీ బ‌డ్జెట్‌తో ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు.

సెల్ టవర్‌కు డెడ్ బాడీ వేలాడుతుండగా.. చుట్టూ కాకులు చేరి అరుస్తున్న సన్నివేశంతో టీజర్ ప్రారంభం అవుతుంది. సెల్‌ఫోన్లు హఠాత్తుగా మాయమయ్యే కాన్సెప్ట్‌.. సైన్స్‌కు అందని శక్తిని ఎదుర్కోవడం కోసం చిట్టి రోబో రంగంలోకి దిగడం లాంటి సీన్లతో టీజర్ అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -