Sunday, May 12, 2024
- Advertisement -

కుటుంబ సమేతంగా వెళ్లిన సూపర్ స్టార్

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలసి అమెరికా వె‌ళ్లారు. ఆయన నటిస్తున్న కబాలి చిత్రం షూటింగ్ పనులు పూర్తి కావడంతో ఆయన అమెరికా వెళ‌్లారు.  ఈ వేసవి సెలవులను ఆయన అమెరికాలోనే గడుపుతారు. రజనీ కాంత్ వెంట ఆయన భార్య, అల్లుడు, నటుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు.

వీరే కాదు రజనీకాంత్ ముఖ్య స్నేహితులు కూడా అమెరికా వెళ‌్లారు. ఆయన నటించిన కబాలి చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 2.0 చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ తొలి పార్ట్ పూర్తి అయ్యింది. రెండో పార్ట్ జూన్ రెండో వారంలో ఉంటుంది. దీంతో ఈ మధ్య దొరికిన ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు రజనీకాంత్ అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -