- Advertisement -

426 కోట్ల లాభాలతో గాల్లోకి

- Advertisement -

జెట్ ఎయిర్ వేస్ లాభాల బాటలో గాల్లో తేలుతోంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి జెట్ ఎయిర్ వేస్ లాభం 426 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఎవరూ ఊహించనంతగా విమాన ఇంధన ధరలు తగ్గాయి. దీంతో ప్రయాణీకులు కూడా పెరగడంతో ఈ లాభాలు వచ్చాయని సంస్ధ భావిస్తోంది. గత ఏడాది జెట్ ఎయిర్ వేస్ భారీగా నష్టాలను చవి చూసింది.

ఆ సంవత్సరం ఏకంగా 1803 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ ఏడాది వచ్చిన లాభాలతో సంస్ధకు కాసింత ఉపశమనం కలిగింది. ఇక ఆదాయం విషయానికి వస్తే అది కూడా బాగానే పెరిగింది. ఇంతకు ముందు ఆదాయం 5,064.52 కోట్ల రూపాయలుంటే ఈ ఏడాది అది 5245.28 కోట్లకు పెరిగింది. వీటిన్నిటి కంటే ముఖ్యమైనది కంపెనీ ఖర్చులు భారీగా తగ్గాయి.

ఈ ఏడాది 4848.14 కోట్ల రూపాయల వరకూ ఖర్చులు తగ్గాయి. ఇక ఇంధన వ్యయం 1334.47 కోట్ల రూపాయల నుంచి 999 కోట్ల రూపాయలకు తగ్గింది. జెట్ ఎయిర్ వేస్ కు ఇంధనంలోనే దాదాపు 300 కోట్ల రూపాయల మిగులు కనిపించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -