నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్సర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఆగస్టు 10న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రజనీకాంత్ భాషను మించి రికార్డు వసూళ్లను రాబట్టింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్ లాంటి స్టార్స్ నటన సినిమాకు ప్లస్ అనిరుధ్ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.
ఇక సినిమా విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండో రోజు 56 కోట్లు, మూడో రోజు 68 కోట్లు వసూలు చేసి 200 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటివరకు దాదాపు రూ. 650 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు రజనీకాంత్. రెమ్యునరేషర్ రూపంలో రూ.200 కోట్లవరకు తీసుకున్నారు రజనీ. ఇక దక్షిణాదిన రజనీ దరిదాపుల్లో ఏహీరో కూడా లేరు. ఇక ప్రస్తుతం రజనీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కలెక్షన్స్ పెరుగుతుండటంతో నిర్మాత ఇటీవలె రజనీకి రూ. 100 కోట్ల చెక్‌తో పాటు ఖరీదైన కారును బహుమతిగా కూడా ఇచ్చారు. ఏడు పదుల వయస్సులో రజనీ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక సెప్టెంబర్ 7 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో జైలర్ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచిచూడాలి..