తలైవా రజినీకాంత్ స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. కాలా, కబాలి, రోబో 2.0 ఇలా వరుసగా సినిమాలు చేస్తు అభిమానులకు జోష్ పంచుతున్నాడు . రజనీ కొత్త చిత్రంపేటా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కథ ప్రకారం సినిమాలో రజినీకాంత్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.
అందులో ఒకటి హాస్టల్ వార్డెన్ పాత్ర అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్ లో ఒక సన్నివేశంలో కుర్ర హీరోయిన్ మేఘాఆకాష్ కూడా కనిపించింది. బాబీ సింహా, నవజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతిల పాత్రలను వైవిధ్యంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్‌ను కేవలం తమిళంతో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ సరసన మొదటిసారి సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కనిపించనున్నారు.సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు