Thursday, May 2, 2024
- Advertisement -

2.0 అస‌లు క‌లెక్ష‌న్లు ఇవేన‌ట‌..!

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన రోబో 2.O సినిమా గ‌త గురువారం విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.శంక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించాడు. మొద‌టి వీకెండ్ పూర్తి చేసుకున్న‌ప్ప‌టికి సినిమా క‌లెక్ష‌న్లు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు.తాజాగా ఈ సినిమా క‌లెక్ష‌న్ల‌ను తమిళ సినిమా విశ్లేషకుడు రామేష్ బాలా నేడు తన ట్విట్టర్ లో అధికారికంగా కొన్ని వివరాలను తెలియజేశారు. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో నాలుగువందల కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది. యూఎస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ చిత్రంగా 2.0 నిలిచిందని పేర్కొన్నారు.

రంగస్థలం మొత్తంగా 3.5మిలియన్ డాలర్ల లైఫ్ టైమ్ గ్రాస్ ను 2.0 కేవలం నాలుగురోజుల్లోనే క్రాస్ చేసి 4 మిళియన్స్ ను దాటేసింది. ఇక నార్త్ అమెరికా సైడ్ లో ఇటీవల రిలీజైన హాలీవుడ్ సినిమాలకంటే శంకర్ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టినట్లు పేర్కొన్నారు. ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ (40.2)ను వెనక్కునెట్టేసి 52.5 మిలియన్‌ డాలర్లతో 2.0 మొదటి స్థానంలో నిలిచినట్లు రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఇక తెలుగు,హింది భాష‌ల‌లో కూడా సినిమా స్ట్రాంగ్ క‌లెక్ష‌న్లు సాధించిన‌ట్లు రామేష్ బాలా తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -