Wednesday, May 22, 2024
- Advertisement -

రెండు గంటల్లో కబాలి టికెట్ లు ఓవర్

- Advertisement -

ప్రస్తుతం కబాలి సినిమా క్రేజ్ ఎలా ఉందొ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విషయం లో రజినీకాంత్ తో పాటు ఫాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకూ రజిని వరస ప్లాపులతో వివాదాలలో  ఉన్నా కూడా ఈ సినిమా విడుదల కోసం అందరూ తీవ్రంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది.

కబాలి సినిమా తేదీ ఇదిగో అదిగో అంటూ 22 జూలై కి ఫిక్స్ చెయ్యగా దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడే మొదలు అయ్యింది. అమెరికాలోని శాన్ జోస్ లో ఒక థియేటర్లో ప్రిమియర్ షో టికెట్లు 25 డాలర్ల ధరతో ఇలా అమ్మకానికి పెట్టారో లేదో.. రెండే రెండు గంటల్లో అన్నీ హాంఫట్ అయిపోయాయి. అమెరికాలో తెలుగు-తమిళ భాషల్లో కలిపి ‘కబాలి’ 400 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. సౌత్ ఇండియన్ సినిమాల్లో ఇదో రికార్డు. ఈ స్క్రీన్లన్నింట్లోనూ ప్రిమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -