Friday, May 3, 2024
- Advertisement -

అధికమే తప్ప.. అతివ్రష్టి కాదంటున్న వాతావరణ శాఖ

- Advertisement -

ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయని, అది అధిక వర్షాలుగా ఉంటాయి తప్ప అతివ్రష్టి కాదని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది దేశమంతా 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీంతో ప్రధాన నదులు, చెరువులు నీళ్లతో నిండుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక వర్షం కురుస్తుందని, ముఖ్యంగా రాయలసీమలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అలాగే కోస్తా జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కూడా అధిక వర్షాలు కురిసే అవకాశముందంటున్నారు. తెలంగాణ జిల్లాల్లో 105 నుంచి 106 శాతం వర్షాలు కురుస్తాయని, ఇది మంచి పరిణామమేనంటున్నారు. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగానే కదులుతున్నాయని, ఒక్కరోజులోనే అవి తమిళనాడులో ప్రవేశించాయని అధికారులు చెబుతున్నారు.

వర్షాలు 120 శాతం కంటే ఎక్కువ కురిస్తే దానిని అతివ్రష్టిగా చూడాలని, అయితే ఈ సారి 105 నుంచి 106 శాతం మాత్రమే కురుస్తాయి కాబట్టి ఇది అతివ్రష్టిలోకి రాదని, దీని వల్ల వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -