Tuesday, May 21, 2024
- Advertisement -

మురుగదాస్‌తో ర‌జ‌నీకాంత్‌..!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్ప‌టికే కాలా సినిమాతో సంద‌డి చేసిన ర‌జ‌నీ, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో 2.0ని విడుద‌ల‌కు రెడీ చేస్తున్నాడు.ఇక ఇప్ప‌టికే మ‌రో కొత్త సినిమాను ప్రారంభించాడు. పిజ్జా ఫేం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టయింది.

తాజ‌గా ర‌జ‌నీ మ‌రో సినిమాను లైన్లో పెట్టిన‌ట్లుగా స‌మాచారం.కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్ మురుగ‌దాస్ ఇప్ప‌టి వ‌రుకు ర‌జనీతో సినిమా చేయ‌లేదు. ఇప్పుడు ఆ కోరిక తీరుతుంద‌ని తెలుస్తుంది.ఇంతకుముందు రజనీతో సినిమా తీయడానికి మురుగదాస్ ఓ స్టోరీ తయారు చేసుకున్నాడు. కాకుంటే రజనీ ఆ స్టోరీ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. దాంతో మురుగదాస్ రజనీకి నచ్చేలా స్క్రిప్టులో మార్పుచేర్పులు చేసి వినిపించాడట.

మురుగుదాస్ చెప్పిన మార్పులు నచ్చడంతో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. ప్రస్తుతం మురుగదాస్ తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే ర‌జ‌నీతో సినిమా మొద‌లు పెడ‌తాడు మురుగదాస్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -