Saturday, May 18, 2024
- Advertisement -

కాలా ట్రైలర్ రివ్యూ: కబాలి అమ్మ మొగుడు అయ్యేలా ఉందిగా?

- Advertisement -

రజినీకాంత్‌కి తెలుగు నాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి ఆ సూపర్ క్రేజ్ ఎలా వచ్చింది? రజినీకి హైప్ తెచ్చింది ఎవరు? రాజకీయాల్లోకి రావాలన్న చిరంజీవి ఆలోచన తెలుసుకుని రజినీని ఓ రేంజ్‌లో జాకీలేసి లేపారు పచ్చ మీడియా బ్యాచ్. చిరంజీవికంటే యాక్టింగ్, డ్యాన్స్‌లు, ఫైట్స్…….ఇలా చాలా విషయాల్లో వీక్ అయిన రజినీని వ్యక్తిత్వం పేరుతో దేవుడిని చేసిపడేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు ఇచ్చేసరికి పవన్‌ని కూడా దేవుడిని చేశారు. అఫ్కోర్స్ చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి గురించి పవన్ మాట్లాడిన వెంటనే దెయ్యమైపోయాడనుకోండి……….అది వేరే విషయం.

ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే చంద్రబాబు స్వార్థం కోసం తెలుగు ప్రజల నెత్తిన అర్హతకు మించి రుద్దిన ఆ రజినీకాంత్ వారు ఇప్పుడు వరుసగా చుక్కలు చూపించే సినిమాలు చూపిస్తున్నాడు. ఒకటిన్నర నిమిషాల టీజర్ చూపించి కబాలిని భారీ రేట్లకు అమ్మేశారు. ఇప్పుడు అదే డైరెక్టర్‌తో కాలా అంటూ మరోసారి ముందుకు వచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తున్నారన్న విషయం మరిచిపోయారో ఏమో కానీ 70ల నాటి పరమ ముతక కథతో ట్రైలర్ వచ్చింది. అది కూడా అంతా తమిళ వాసనే. తమిళ మార్క్ అతినే. కొంతమంది పేదలు……వాళ్ళను కబలించాలనుకునే విలన్…….ఆ విలన్‌ని అడ్డుకునే హీరో దేవుడు రజినీకాంత్. ఇదే కాలా ట్రైలర్. ఇదే ట్రైలర్‌లో ఏ తెలుగు హీరో కనిపించి ఉన్నా మన మీడియా వాళ్ళందరూ కూడా విమర్శల వర్షం కురిపించేవాళ్ళు. కానీ రజినీతో ఏం అవసరాలు ఉన్నాయో, పబ్లిసిటీ డబ్బులు ఎక్కువ ఇస్తారో ఏమో తెలియదు కానీ ఇప్పుడిక ఈ కాలా ట్రైలర్ బాగుందంటూ కొన్ని రివ్యూలు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. పరమ రొటీన్, ముతక ట్రైలర్‌తో వస్తున్న కాలా సినిమాపై హైప్ పెంచడం ……ప్రేక్షకులకు ఆశలు కల్పించి థియేటర్స్‌కి తీసుకురావడం ….మరోసారి కబాలి సినిమా అనుభవం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ కాలా సినిమాలో కబాలి సినిమాలో ఉన్నంత మేటర్ అయినా ఉంటుందా అన్న అనుమానం అణువణువునా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -