- Advertisement -

హైపర్ ఆదిపై నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి

- Advertisement -

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువగా పంచ్‌లు విసురుతుంటాడు. ఈ క్రమంలోనే ఆది ఇటీవల తన షోలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సంచలనం శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పంచ్‌లు విసిరారు.

దీంతో హైపర్ ఆదిపై నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి. ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా లైవ్ ఇచ్చిన శ్రీరెడ్డి. ఆమె జబర్ధస్ట్ ప్రోగ్రామ్ గురించి అందులో హైపర్ పంచులు గురించి పంచుకుంది. గత వారం పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ తన మీద పంచ్ వేశాడంటు చెప్పింది. ఇలాంటి వెదవ వేషాలు వేస్తే నీ అంతు చూస్తానని. నా జోలికి అమ్మాయిల జోలికి వస్తే చెప్పుతో కొడతా, ఒళ్లు జాగ్రత్త అంటు వార్నింగ్ ఇచ్చింది.

గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్‌ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు.

పోరాట దీక్షను చాలా అవమానించినట్లు మాట్లాడావు. నీకొచ్చిన దురద ఏమిటి? నీతో ఇవి రాయించింది ఎవరు? అంత దాకా వస్తే ఎవరినీ వదిలేది లేదు. షర్ట్ ఇప్పరా… ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది అని ఒక మాట అన్నావు. మేము విప్పింది, చూపించింది ఒక నిరసన,… అదిది సెక్స్ కాదు… సెక్సీగా చూపించడానికి కాదు. దానికి గౌరవం ఇవ్వలేని నువ్వు….. ఏం పుట్టుక పుట్టావో నాకు తెలుసు అంటూ శ్రీరె్డి ఫైర్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -