Sunday, May 12, 2024
- Advertisement -

విజయసాయితో ఎపి కాంగ్రెస్ ఛీఫ్….. జగన్ నిర్ణయమే ఫైనల్

- Advertisement -

మహానాడుతో టిడిపికి ఊపు తీసుకురావాలనుకున్నాడు చంద్రబాబు. అయితే మోత్కుపల్లి పుణ్యమా అని మొత్తం ప్లాన్ బెడిసికొట్టింది. చంద్రబాబు అంటేనే నమ్మకద్రోహి, నయవంచకుడు అని అనుకునే పరిస్థితులు తెలెత్తాయి. ఇక కర్నూలు జిల్లా, బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే వైకాపాలో చేరడానికి రెడీ అవ్వడం……. మహానాడుకు హాజరవ్వకుండా చంద్రబాబుకు హ్యాండ్ ఇవ్వడం టిడిపిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ఇప్పుడు బాబు గుండెల్లో గుబులు రేపే మరో న్యూస్ బయటికొచ్చింది. 2014 ఎన్నికల్లో అనంతపురంలో మెజారిటీ తెచ్చుకున్న టిడిపి ఇప్పుడు కుంటినడకలు నడుస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత ఓటమి ఖాయం అని చంద్రబాబు సర్వేలోనే తేలింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ రఘువీరారెడ్డి కూడా వైకాపాలో చేరడానికి రెడీ అవుతున్నాడు. పదవులు ఏమీ అవసరం లేదన్న రఘువీరా హిందూపురం నుంచి బాలయ్యపై పోటీ చేయాలన్న ఆసక్తి చూపిస్తున్నాడట. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డితో భేటీ అయి చెప్పాడు. సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయిన రఘువీరా వ్యక్తిగత సర్వేలు కూడా చేయించుకున్నాడట. బీసీల బలంతో వైకాపా తరపున పోటీ చేస్తే హిందూపురం నుంచి బాలయ్యపై తాను గెలుస్తానని లెక్కలతో సహా విజయసాయికి వివరించాడట రఘువీరా. జగన్ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాడు రఘువీరా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -