Thursday, April 25, 2024
- Advertisement -

రాకేష్ మాస్టర్ ఇంటిపై దాడి… పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -

ఆ మద్య రాకేశ్ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో మారు మోగింది. చిన్నా.. పెద్ద అనే స్టార్ అనే తేడా లేకుండా అందరినీ మడత పెట్టి తనదైన స్టైల్లో కామెంట్స్ చేసిన రాకేష్ మాస్టర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఈ మద్య జబర్దస్త్ షోలు చేసుకుంటున్నాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణుడి పై కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం దాని గురించి రాకేష్ మాస్టర్ పై కేసు నమోదయ్యింది.

9 నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో యాదవుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన రాకేష్‌ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సందీప్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌కు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌లోని కృష్ణా నగర్‌లో ఉండే తన ఇంటికి ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కొంత మంది తన ఇంట్లోకి ప్రవేశించి తనను దూషించడంతో పాటు ఇంటి కిటికీలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేరని వివరించారు. దీంతో రాకేష్ మాస్టర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -